కచ్చితంగా వారి సంఖ్య ఎక్కువే.. పది లక్షలు కాదు : WHO

వాస్తవం ప్రతినిధి: కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య వాస్తవానికి పది లక్షల కంటే కచ్చితంగా ఎక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. బుధవారం యూఎన్‌జీఏ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది కరోనా కారణంగా మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయని.. అసలైన సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలని.. అందరికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు.