అత్యంత ఆసక్తికరంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ..!

వాస్తవం ప్రతినిధి:  అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ పాల్గొన్నారు. ఇరువురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. న్యాయ‌మూర్తుల ఎంపిక‌లో ఇటీవ‌ల వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌పై క్రిస్ వాలెస్ మొద‌టి ప్ర‌శ్న అడిగారు. ఈ సందర్భంగా బిడెన్ మాట్లాడుతూ… అమెరికాలో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, వేలాదిమంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నార‌ని జో బైడెన్ అన్నారు.

ఒబామా కేర్ రద్దుపై ప్రశ్న అడగ్గా… అది ఓ పెద్ద డిజాస్టర్ అని ట్రంప్ అన్నారు. తాను మిలియన్ల డాలర్లు ట్యాక్స్ చెల్లించినట్టు ట్రంప్ అన్నారు. అందుకు స్పందించిన బైడెన్.. మరి మీరు అధ్యక్షుడైన తర్వాత మంచి హెల్త్ కేర్ ప్లాన్ ఎందుకు తీసుకురాలేకపోయారని ట్రంప్‌ను ప్రశ్నించారు. ఓ స్కూల్ టీచర్ జీతం కంటే తక్కువ ట్యాక్స్ ట్రంప్ కట్టారని బైడెన్ సెటైర్లేశారు. మీరు నిజంగా అంత ఎక్కువ ట్యాక్స్ కడితే.. రిటర్న్స్ చూపించాలని బైడెన్ డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వస్తే ట్రంప్ ట్యాక్స్ పాలసీని రద్దు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికా చరిత్రలోనే ట్రంప్ చెత్త ప్రెసిడెంట్ అని బైడెన్ మండిపడ్డారు.

బైడెన్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల చర్చ వాడివేడిగా కొనసాగుతోంది.