త్వరగా కోలుకోండి వెంకయ్యనాయుడు అంటూ ట్విట్టర్ లో పవన్ పోస్ట్..!!

వాస్తవం ప్రతినిధి:  ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా ఇండియా ఇటీవల రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ చైనా నుండి బయటకు వచ్చిన ప్రారంభంలో యూరప్ ఖండాన్ని అతలాకుతలం చేయగా తాజాగా ఇప్పుడు భారత్ పై తన ప్రభావం గట్టిగానే చూపుతోంది. అయితే చాలా వరకు మెడిసిన్స్ రావడంతో భారతీయులు గట్టిగానే ఈ మహమ్మారిని ఎదుర్కొంటున్నారు. కాగా దేశంలో రాజకీయ నాయకులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడటం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. బిజెపి నాయకులతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో స్పందించారు. వెంకయ్యనాయుడు ఆరోగ్యంపై ట్విట్టర్ లో పవన్ స్పందిస్తూ….”వెంకయ్య నాయుడు గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను” అని పవన్ తెలిపారు.