రష్యా లో కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో ..

వాస్తవం ప్రతినిధి: గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 8,135 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 11,59,573కు చేరుకుంది. కొత్తగా బయటపడిన కేసుల్లో 2,200 మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదని రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది.మరోపక్క గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి 61 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,385కు చేరింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది.