సోనూసూద్ ని ఘనంగా సన్మానించిన ప్రకాష్ రాజ్..!!

వాస్తవం సినిమా: లాక్ డౌన్ సమయం లో ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు సోనూసూద్. వలస కూలీల విషయంలో సోనుసూద్ స్పందించిన తీరు ప్రభుత్వాలతో పాటు అనేక మందిలో ఓ కదలిక తీసుకు వచ్చినట్లు అయ్యింది. ప్రత్యేకమైన ట్రైన్ లు, బస్సులు ఆఖరికి విమానాలను కూడా సిద్ధం చేసి ఎటువంటి రవాణా సౌకర్యం లేని సమయంలో సోనూసూద్ ముందుకు వచ్చి అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆ తర్వాత తన సేవలు మరింతగా విస్తృతంగా పేదవారికి చేరేటట్లు ప్రత్యేకమైన టీం కూడా సోనుసూద్ ఇటీవల నియమించడం జరిగింది. దేశంలో చాలా మంది హీరోలు ఉన్నాగాని సోనుసూద్ కరోనా లాంటి కష్ట సమయంలో చేసిన హెల్ప్ చాలా మందిని ప్రభావితం చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల షూటింగులు మళ్ళీ స్టార్ట్ అవ్వటంతో “అల్లుడు అదుర్స్” అనే సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి వచ్చిన సోనూసూద్ ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి ఒక జ్ఞాపికను అందజేశారు. సినిమా యూనిట్ మొత్తం సోనూసూద్ రాకతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.