కుప్పకూలిన విమానం..22 మంది దుర్మరణం

వాస్తవం ప్రతినిధి:ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 నిమిషాల సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన మిలిటరీ విమానం కుప్పకూలడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు . మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

మిలటరీ విమానం ఇంజిన్‌ విఫలమై కూలిపోయినట్లు ఆ దేశ ప్రాజిక్యూటర్‌ జనరల్‌ అనుమానిస్తున్నారు. కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం ఘటనాలో స్థలంలో గాలింపు కొనసాగుతున్నది. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టంగా తెలియరాలేదు.