ప్రజా పంపిణీకి ‘స్పుత్నిక్‌ –వీ’.. సిద్ధమవుత్తున్న రష్యా..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌ను నిరోధించే ‘స్పుత్నిక్‌ –వీ’ టీకా త్వరలో మాస్కోలో ప్రజా పంపిణీకి సిద్ధమవుతోందని రష్యా అధికార మీడియా గురువారం వెల్లడించింది. స్పుత్నిక్‌–వీ టీకాలు ప్రజాపంపిణీ కోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని గతవారమే రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు వాటిని పంపించనున్నామని పేర్కొంది. పూర్తిస్థాయి మానవులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలు ముగియకముందే, వినియోగానికి ప్రభుత్వ అనుమతి పొందిన తొలి టీకాగా స్పుత్నిక్‌–వీ నిలిచింది. సుమారు 40 వేల మందిపై జరుగుతున్న ఫేజ్‌ 3 ప్రయోగ ఫలితాలు అక్టోబర్, నవంబర్‌ల్లో వెలువడే అవకాశముంది.