వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడిన వేళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సాధారణ పౌరులతో మాట్లాడేందుకు తన ఫోన్ నంబర్ ఇచ్చి మెసేజ్ పంపండి అంటూ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో విజ్ఞప్తిచేశారు. ప్రజలు ఏం చేస్తున్నారో.. వారి మనసులో ఏమున్నదో.. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారో.. తెలుసుకోవాలనుకుంటున్నానని తన మెసేజ్‌లో చెప్పారు. ” మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉంటే.. నాకు 773-365-9687 వద్ద ఒక మెసేజ్‌ను పంపండి. మీరు ఏం చేస్తున్నారో.. మీ మనసులో ఏముందో.. ఈసారి ఓటు వేయడానికి ఎలా ప్రణాళిక వేస్తున్నారో నేను వినాలనుకుంటున్నాను. నా మనసులో ఉన్నదాన్ని పంచుకోవడానికి నేను ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉంటాను” అని ఒబామా ట్వీట్ చేశారు.