బాలు ఆరోగ్యపరిస్థితిపై వెంకయ్యనాయుడు ఆరా!

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి గత 24 గంటల్లో మరింత విషమంగా ఉన్నట్టు ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

ఎంజీఎంహెల్త్ కేర్ ఆస్పత్రికి ఫోన్ చేసిన వెంకయ్య..ఎస్పీ బాలు ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ బాలు పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకునేందుకు ఉత్తమ వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు వెంకయ్యకు చెప్పినట్టు సమాచారం. అవసరమైతే నిపుణుల సాయం కూడా తీసుకోవాలని డాక్టర్లకు వెంకయ్య సూచించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లావాసులన్న సంగతి విదితమే.

మరోవైపు తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.