బాలకృష్ణ సినిమా పై కన్నేసిన ప్రభాస్….!!

వాస్తవం సినిమా: “బాహుబలి” పుణ్యమా వచ్చిన క్రేజ్ కి ప్రభాస్ భార్య లెవెల్ లోనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మినిమం వంద కోట్ల బడ్జెట్టు దాటేలా ఇతర భాషల్లో ఉన్న ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా స్టోరీలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్…తరువాత నాగ్ అశ్విన్, ఓం రౌత్ సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది.

ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా టైం మిషన్ తరహాలో ఉంటుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా “ఆదిత్య 369”కి డైరెక్టర్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాస్ ని ఇటీవల ప్రభాస్ సినిమా కోసం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ నటిస్తున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సినిమా “ఆదిత్య 369” సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినపడుతోంది. అంతకుముందు “ఆదిత్య 369” సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడుతూ… కచ్చితంగా సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి తరుణంలో “ఆదిత్య 369” సినిమా డైరెక్టర్ ప్రభాస్ సినిమాలో ఉండటంతో… ఇది కచ్చితంగా బాలకృష్ణ సినిమాకి సీక్వెల్ అన్న వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరందుకున్నాయి.