ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమం

వాస్తవం ప్రతినిధి: ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైధ్యులు తాజాగా హెల్త్ బుల్టిన్ విడుదల చేశారు. కరోనా బారినపడి సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలు ఆరోగ్యం విషమించినట్టు తెలుస్తుంది.  ప్రస్తుతం బాలు కి కరోనా తగ్గినా ఇతర సమస్యలతో ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు.

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకు తెలుపుతూనే ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.