విజయవాడ కనకదుర్గ బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన!

వాస్తవం ప్రతినిధి: విజయవాడ కనకదుర్గ బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. విజయవాడ తాడిగడపకి చెందిన మన్నేదుర్గాప్రసాద్‌ పూజ చేసుకుంటానని బ్రిడ్జి వద్దకి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తనకు తోడుగా తన తమ్ముడి కుమారుడు సుజిత్ ను బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చాడు. సుజిత్ తో తాను పూజ చేయుకుంటానని కాసేపు వీడియో తీయాలని దుర్గాప్రసాద్ కోరాడు. సుజిత్ వీడియో తీస్తున్న క్రమంలోనే దుర్గాప్రసాద్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో సుజిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యలకు చేరవేసాడు. దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్న సూసైడ్ నోట్ అతడి ఇంట్లో దొరికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.