వ్యాక్సిన్‌‌ బ్లూప్రింట్‌ విడుదల చేసిన ఆస్ట్రాజెనెకా

వాస్తవం ప్రతినిధి : బ్రిటీష్‌ ఫార్మాస్యూటికల్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. 111 పేజీల క్లినికల్ ట్రయల్ బ్లూప్రింట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల సహకారంతో ఆస్ట్రాజెనెకా టీకాను తయారుచేస్తున్నది. దీనిని ‘ఏజడ్‌డీ1222’గా పిలుస్తున్నారు. ఇండియాలో దీన్ని ‘కొవిషీల్డ్‌’ పేరుతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఉత్పత్తి, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భారత్‌తోపాటు యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మూడో దశ ట్రయల్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి.