కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు భారత ప్రభుత్వం తీపి కబురు..!!

వాస్తవం ప్రతినిధి : లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న కెనడా పౌరులకు, కెనడా వెళ్లాలనుకునే భారతీయులను భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దాదాపు 13దేశాలతో ఎయిర్‌ బబుల్ ఒప్పందం కుదుర్చున్న భారత ప్రభుత్వం.. తాజాగా కెనడా ప్రభుత్వంతో ఎయిర్ ‌బబుల్ అగ్రిమెంట్ కుదుర్చుకుందని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూర్తి ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కెనడాలో చిక్కుకున్న భారత పౌరులు, ఓసీఐ కార్డుదారులు, చెల్లుబాటు వీసా కలిగిన కెనడా పౌరులు భారత్‌కు రావొచ్చని వివరించారు.