సింగపూరులో దారుణం.. అల్లుడిని హతమార్చిన మామ..!!

వాస్తవం ప్రతినిధి : భారత సంతతికి చెందిన అల్లుడిని హతమార్చిన కేసులో చైనా సంతతికి చెందిన వ్యాపారస్థుడికి సింగపూరు కోర్టు ఎనిమిదిన్నరేళ్ల జైలుశిక్షను విధించింది. తాన్ నామ్ సెంగ్(72) అనే వ్యాపారస్తుడి కూతురిని స్పెన్సర్ తుపాని(38) అనే భారతీయుడు వివాహం చేసుకుని, తుపాని మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. తనను, తన కూతురిని మరిన్ని కష్టాలు పెడుతున్నాడని తాన్ నామ్ సెంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ రెస్టారెంట్‌లో తుపాని లంచ్ చేస్తుండగా.. తాన్ నామ్ సెంగ్ అక్కడకు వెళ్లి కత్తితో పొడిచి తుపానిని హతమార్చాడు. ఇక అప్పటి నుంచి ఈ కేసు కోర్టు పరిధిలోనే ఉంటూ రాగా.. సోమవారం తాన్ నామ్ సెంగ్‌కు ఎనిమిదిన్నరేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.