స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కరోనా వైరస్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్లీ మొదలు కావడంతో ఈ వార్త బయటకి రావడంతో అభిమానులలో సంతోషం నెలకొంది. వాస్తవానికి మహమ్మారి వైరస్ రాకపోయి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది వేసవి కాలంలో అనగా మే 15వ తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా. అప్పటికే దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ఉంది. కొద్దిపాటి బ్యాలెన్స్ ఉన్న సమయంలో వైరస్ రావడంతో షూటింగ్ లు ఆగిపోవడంతో…. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యారు.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీ షూటింగ్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను ముందుగా షూట్ చేస్తున్నారట. త్వరలోనే అనగా మరో రెండు వారాల్లో పవన్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతున్నట్లు హీరోయిన్ శృతి హాసన్ తో కొన్ని సన్నివేశాలు అదే విధంగా ఫైట్స్ చిత్రీకరించడానికి యూనిట్ సభ్యులు సిద్ధమైనట్లు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెలలో పూర్తిగా కంప్లీట్ చేసి జనవరి కి సినిమాని పక్కాగా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.