అందుకేనా జగన్ ఢిల్లీ పర్యటన??

వాస్తవం ప్రతినిధి: వైయస్ జగన్ సెప్టెంబర్ 22వ తారీఖున ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా మరికొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అదేవిధంగా సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకు రానున్నారు అని పార్టీలో టాక్.

అంతేకాకుండా జగన్ ఈ పర్యటనలో అమరావతి రాజధాని భూములకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టే అవకాశం కల్పించాలని మోడీని, అమిత్ షా ని కోరనున్నట్లు…. ఇందుకోసమే జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సరికొత్త వార్త ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతుంది. మరోపక్క ఎన్డీఏ గూటికి జగన్ చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ తాజా ఢిల్లీ పర్యటన భవిష్యత్తులో ఏపీలో అనేక రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది అని మేధావులు చెప్పుకొస్తున్నారు.