ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

వాస్తవం సినిమా: ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చడానికి రాజమౌళి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. విషయం లోకి వెళ్లి పోతే రాజమౌళి దర్శకత్వంలో “RRR” లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి టీజర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేస్తున్నట్లు అప్పట్లో అనేక ఆశలు రేపెట్టారు రాజమౌళి. కానీ చివరి నిమిషంలో టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నట్లు, పైగా లాక్ డౌన్ సమయం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో అభిమానులు దయచేసి క్షమించాలని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇదిలా ఉండగా లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు టాక్. ముందుగా ఎన్టీఆర్ చరణ్ కాకుండా మిగతా నటీనటుల పై ఉన్న కీలక సన్నివేశాలను కంప్లీట్ చేసేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. అదంతా అలా ఉంచితే ఈ దసరాకు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయటానికి జక్కన్న రెడీ అయినట్లు టాక్.

గత కొన్నాళ్ల నుండి కొమరంభీం పాత్రలో తారక్ లుక్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ అభిమానులలో ఉంది. దీంతో వారి కలలు నెరవేర్చటానికి రాజమౌళి దసరా పండుగను టార్గెట్ చేసుకుని టీజర్ రిలీజ్ చేయటానికి రెడీ అవ్వటంతో ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.