అచ్చెన్నాయుడు కి కీలక పదవి అప్పజెప్పిన చంద్రబాబు..!!

వాస్తవం ప్రతినిధి: ESI స్కామ్ లో మొన్నటి వరకు జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపించి ఆయనను అరెస్టు చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో చంద్రబాబు మరియు టిడిపి పార్టీలో కీలక నాయకులు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ఇదిలా ఉండగా తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన అచ్చెంనాయుడుకి చంద్రబాబు కీలక పోస్ట్ అప్పజెప్పినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే టిడిపి పార్టీ గళాన్ని బలంగా వినిపించే నాయకులలో మొదటి ప్లేస్ లో అచ్చెన్నాయుడు ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడుకి ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవిని చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం.

సో ఈనెల 27వ తారీఖున అధికారికంగా ఈ ప్రకటన పార్టీ అధిష్టానం ప్రకటించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బీసీ సామాజిక వర్గం కావటంతో అచ్చెన్నాయుడు కూడా అదే వర్గం కావటంతో…. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని చంద్రబాబు అచ్చెన్నాయుడు కి ఈ పోస్ట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.