సరిగ్గా మరో 40 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బిడెన్‌ వైపే భారతీయ ఓటర్లు..!!

వాస్తవం ప్రతినిధి: సరిగ్గా మరో 40 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇవి 59వ అధ్యక్ష ఎన్నికలు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (74), డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ (78) గెలుపు కోసం సర్వశక్తులూ పోరాడుతున్నారు. ట్రంప్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌నే ఎంపిక చేసుకోగా- బిడెన్‌ తొలిసారిగా ఓ భారతీయ అమెరికన్‌ కమలా హారి్‌సను ఎంపిక చేశారు. అభిశంసన మచ్చ పడి మళ్లీ బరిలో దిగిన అధ్యక్షుల్లో ట్రంప్‌ రెండోవారు. రెండోసారీ తన ఎన్నిక ఖాయమని ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఒపీనియన్‌ పోల్స్‌లోనూ బిడెన్‌కే ఆధిక్యం కనబడింది.

అమెరికాలో 12 లక్షల భారతీయ ఓటర్లు కీలకం. బిడెన్‌ భారతీయ ఓటర్ల మనసు గెలుచుకునేందుకే ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారి్‌సను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అయితే మోదీతో ట్రంప్‌ బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు. అయినా భారతీయుల మద్దతు ట్రంప్‌కు 30శాతం, బిడెన్‌కు 70శాతం ఉందని ‘ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పాసిఫిక్‌ ఐలండర్స్‌ (ఏఐపీఐ) అనే సంస్థ తేల్చింది.