జెట్ స్పీడుతో బాలయ్య బాబు సినిమా…??

వాస్తవం సినిమా: మహమ్మారి కరోనా వైరస్ రావటంతో బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కరోనావైరస్ రాకపోయి ఉంటే ఈపాటికి సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండాల్సింది. కరోనా వచ్చి షూటింగ్ ను ఆపేయటం తో మొన్నటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ప్రస్తుతం…. షూటింగులకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వటంతో ఈసారి జెట్ స్పీడుతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయటానికి బోయపాటి- బాలయ్య ఒకే ఒక్క షెడ్యూల్ లో అన్నిటినీ కవర్ చేసే రీతిలో రూపొందించినట్లు టాక్. అంతేకాకుండా ఒకవైపు టాకీపార్ట్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేసే రీతిలో సినిమా యూనిట్ ఇప్పటికే రెడీ అయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి జనవరి 15వ తారీఖున భారీ స్థాయిలో విడుదల చేయాలని బాలయ్య బోయపాటి అనుకున్నట్లు టాక్. “వినయ విధేయ రామ” సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా తో మళ్లీ ఫామ్ లోకి బోయపాటి రావాలని అనుకుంటున్నారు.

మరోపక్క బాలయ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని…. మంచి కసితో పని చేస్తున్నారు. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో…. వస్తున్న ఈ మూడో సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నందమూరి ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.