యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి రేసులో భారత సంతతి జడ్జి

వాస్తవం ప్రతినిధి: పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానం భర్తీ చేసే జడ్జిల జాబితాలో భారత సంతతి జడ్జి అముల్ థాపర్ ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ శనివారం మాట్లాడుతూ రూత్ స్థానంలో కొత్తవారి ఎంపికలో ఎలాంటి ఆలస్యం జరగదని చెప్పారు. కానీ, ఆమె స్థానంలో ఎవర్ని, ఎప్పుడు నియమించబోతున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ట్రంప్ వద్ద ఇప్పటికే 20 మంది సమర్థవంతమైన జడ్జిల జాబితా ఉన్నట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా ఈ జాబితాలో ఉన్నా థాపర్… 2018లో పదవీ విరమణ చేసిన జస్టిస్ స్టీఫెన్ కెన్నెడీ స్థానం భర్తీ సమయంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ, ఈ రేసులో థాపర్‌ను వెనక్కి నెట్టి బ్రెట్ కవనాగ్ ఎంపికయ్యారు. 51 ఏళ్ల థాపర్ ప్రస్తుతం 6వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.