ఏపీలో స్టార్ట్ అయిన సిటీ బస్సులు..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ కారణంగా ఆరునెలలపాటు షెడ్ కి పరిమితమైన సిటీ బస్సులు ఏపీలో సెప్టెంబర్ 19 వ తారీకు నుండి రోడ్డు ఎక్కాయి. విజయవాడ, విశాఖపట్టణం లో సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు ఉదయం 6 గంటల నుంచి దాదాపు వంద బస్సులు పలు రోడ్లలో సేవలందించడానికి స్టార్ట్ అయ్యాయి. కాగా కరోనా వైరస్ నిబంధనలను సిటీ బస్సుల్లో కూడా కఠినంగా అమలు చేయడానికి ఆర్టీసీ అధికారులు గట్టిగానే చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులో స్టాండింగ్ కి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని, అంతేకాకుండా బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడు ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన తర్వాతే బస్సులోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా అనారోగ్య సమస్యలు బాధపడితే అనుమతించే ఆసక్తి లేదని తేల్చారు. బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించేలా నిబంధనలు విధించారు. అదే రీతిలో బస్సులో వృద్ధులకు పిల్లలకు అనుమతి నిరాకరించారు.