ఐరాస యువ నాయకుల జాబితాలో భారతీయుడికి చోటు..!!

వాస్తవం ప్రతినిధి: సెప్టెంబర్ 2015 ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి సదస్సులో 17 లక్ష్యాలతో ‘సుస్థిరాభివృద్ధి 2030 అజెండా’ను ప్రతిపాదించారు. అనేక ముఖ్య ఒప్పందాలతో అంతర్జాతీయ విధాన రూపకల్పనకు ఈ సదస్సు కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రపంచ సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకు ప్రభుత్వం భాగస్వామ్యం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, పౌరుల పాత్ర ప్రధానం.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రగతిని ‘సుస్థిర అభివృద్ధి నివేదిక 2019’లో పొందుపరచడం జరిగింది. సుస్థిరాభివృద్ధి సొల్యూషన్‌‌స నెట్‌వర్‌‌కలోని స్వతంత్ర నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతిని నివేదికలో పొందుపర్చారు. అసమానతల తగ్గింపు, జీవ వైవిధ్య నష్ట నివారణ, వాతావరణ సంక్షోభం నివారణ ద్వార ఆర్థిక పురోగతి సాధించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఉద్దేశంగా నివేదిక పేర్కొంది.

కాగా, ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన యువ నాయకుల జాబితాలో భారత్‌కు చెందిన ఉదిత్‌ సింఘాల్‌(18)కు చోటు లభించింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న గాజు సీసాలను ఎలా సద్వినియోగం చేసుకో వచ్చో ఉదిత్‌ చేసి చూపించాడు.