కంగనా పై ఇండైరెక్ట్ కామెంట్ చేసిన సన్నీ లియోన్..!!

వాస్తవం సినిమా: ఇటీవల సుశాంత్ సూసైడ్ కేస్ విషయంలో మహారాష్ట్ర సర్కార్ ను ఇబ్బందులు పాలు చేసే రీతిలో కంగనారనౌత్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఉన్న కొద్ది కంగనారనౌత్ రాజకీయ నాయకురాలిగా వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ విమర్శలు చేస్తూ ఉన్న క్రమంలో తాజాగా ఊర్మిలా మంతోండ్కర్ ని అడ్డం పెట్టుకొని హీరోయిన్ సన్నీలియోన్ పై ఎటకారం అయినా కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టింది. కంగనా పెట్టిన పోస్ట్ ఏమిటంటే… సినీ నటిగా పాపులర్ అయ్యి ప్రస్తుతం పాలిటిక్స్ లో రాణిస్తున్న ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ గా అభివర్ణించిన కంగన, ఆపై, తానేమీ తప్పుగా విమర్శించలేదని, భారత సినీ పరిశ్రమ సన్నీ లియాన్ వంటి అడల్ట్ స్టార్ ను కూడా స్వాగతించిందని వ్యాఖ్యానించింది. ఇక, ఈ కామెంట్లను చూసిన సన్నీ లియాన్, తన ఇన్ స్టాగ్రామ్ లో “నీ గురించి ఎంతో తక్కువ తెలిసిన వాళ్లు, ఎంతో ఎక్కువ మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది” అని కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు సన్నిలియోన్ చెప్పింది వందకి 100% కరెక్ట్ అని లైకులు కొట్టారు. కంగనా రనౌత్ పై ఇండైరెక్టుగా సన్నీలియోన్ పెట్టిన పోస్ట్ కి నాలుగు లక్షల లైక్ లు వచ్చాయి.