ఇకపై వారికి డిక్లరేషన్ అవసరం లేదు..టిటిడి కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న కీలక విధానాన్ని మార్చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం.. అన్య మతస్తులు ఎవరైనా సరే.. స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే.. తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

అందులో స్వామి వారిని నమ్ముతున్నట్లుగా ఉండేది. తాజాగా అలాంటి డిక్లరేషన్ ఏమీ అవసరం లేకుండానే అన్య మతస్తులు ఎవరైనా సరే స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో.. ఇంతకాలం అన్య మతస్తులు ఎవరైనా సరే స్వామి వారి దర్శనానికి ఉన్న పరిమితులు తొలిగిపోయినట్లుగా చెప్పాలి. మరి.. దీనిపై హిందూ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.