ఇండియాలో ఒక్కసారిగా రెచ్చిపోయిన కరోనా..??

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రారంభంలో దీటుగా ఎదుర్కొన్న దేశాలలో భారత్ ముందు ఉంది. ప్రపంచంలోని అభివృద్ధి, ధనిక దేశాలుగా పిలువబడే యూరప్ దేశాలు మాత్రం కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో స్టార్టింగ్ లో ఫెయిల్ అయిపోయాయి. అయితే వైరస్ చాలావరకు బలహీనపడిన గాని ప్రస్తుతం మాత్రం ఇండియాలో కరోనా తెగ రెచ్చిపోతుంది. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు రోజుకి 90 వేలకు పైగానే బయట పడుతున్న తరుణంలో పరిస్థితి ఉన్నా కొద్దీ రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

ఇప్పటికే యాభై లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. కాగా త్వరలో ఇండియాలో శీతాకాలం రానున్న తరుణంలో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే శీతాకాలం లో వైరస్ బలపడే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దేశంలో ఒక్కసారిగా 24 గంటల్లో 1000 కి పైగా మరణాలు సంభవించడం తో ప్రభుత్వాలు, వైద్యుల లో కూడా టెన్షన్ నెలకొంది. దేశంలో రికవరీ రేటు పెరుగుతుంది అని చెబుతున్న గాని మరణాలు ఈ రీతిలో సంభవించడం ప్రజలలో కూడా కాస్త ఆందోళనకరంగా మారింది.