భారీ ఉగ్ర కుట్ర భగ్నం..9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. వీరంతా పలు ముఖ్య నగరాల్లో దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు విచారిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అరెస్ట్ కావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అరెస్టైన వారిలో ఆరుగురు పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు ఎర్నాకుళంలో పట్టుబడ్డారు. వీరి నుంచి ఆయుదాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు కీలక ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేశారు.

వీరు దాడులకు కుట్రలు పన్నడమే కాకుండా అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో ముర్షీద్ హసన్, యాకూబ్ బిశ్వాస్, ముషారఫ్ హుస్సేన్‌లను కేరళలో, షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యీన్ అహ్మద్, మనుమ్ కమల్, రెహ్మాన్‌లను బెంగాల్‌లోని ముషీరాబాద్‌లో అరెస్ట్ చేసినట్టు వివరించారు.