వాస్తవం ప్రతినిధి: ఓ న్యాయవాదికి న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. అన్నదాతపై హత్యాయత్నానికి పాల్పడినందుకు గాను ఈ కేసులో న్యావధి దోషిగా తేలడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. వివరాలప్రకారం..
చెన్నై లోని నామక్కల్ జిల్లా బోడినాయకన్‌పట్టి సమీపంలోని గజకొంబు ప్రాంతానికి చెందిన రైతు సతీష్‌కుమార్ (27), సేందమంగళం సమీపం ముత్తుక్కాడు చెందిన న్యాయవాది రవికుమార్ (36)ల మధ్య స్థలానికి సంబంధించిన వివాదం కక్షలకు దారితీసింది. 2017 అక్టోబరు 19న రవికుమార్, అతని మద్దతుదారులు సతీష్‌కుమార్‌పై దాడిచేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై ఎరుంపట్టి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి రవికుమార్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే, ఈ ఘటనలో రవికుమార్‌పై అంటరానితనం నిర్మూలన చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నామక్కల్ జిల్లా ఎస్పీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగింది. తీర్పులో న్యాయవాది రవికుమార్‌కు యావజ్జ్జీవ శిక్ష, రూ.1,000 జరిమానా విధించడంతో పాటు బాధితుడికి పరిహారంలో రూ.50 వేలు అందించాలని ఆదేశించారు.