జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం ఇదే: లోకేష్

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అగ్రనేత, శాసనమండలి సభ్యుడు నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కుడిచేత్తో రూపాయి ఇచ్చి ఎడమచేత్తో రూ.10 కొట్టేయడమే జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం అంటూ విమర్శించారు. పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2,500 అని వివరించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేసింది లేదని, కనీసం గుంతలు కూడా పూడ్చని వైసీపీ ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం అని విమర్శించారు. పీల్చే గాలిపై కూడా జగన్ పన్ను విధించడం ఖాయం అని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.