ఎన్నికల బరిలో కోదండరామ్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో ఈ వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కోదండరాం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కెసిఆర్ తో పాటు ఉద్యమంలో కోదండరాం చేసిన పోరాటం ఎవరు మరువలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కోదండరామ్ మరియు కేసీఆర్ గ్యాప్ రావడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చక కోదండరాం తెలంగాణ జన సమితి అనే పార్టీ పెట్టడం జరిగింది. పరిస్థితి ఇదిలా ఉండగా..

జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, సీపీఐ, సీపీఎం మరియు న్యూ డెమోక్రసీ పార్టీలకు లెటర్ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు, యువత నిజంగా ఇటువంటి సమయంలో కోదండరామ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని నమ్ముతున్నారు. మండలిలో కోదండరామ్ లాంటి నాయకుడు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని కాబట్టి గెలిపించాలి అంటూ మరోపక్క తెలంగాణ జన సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా అని పార్టీలను కోరింది.