యూపీలో అతి పెద్ద ఫిలిం సిటీ నిర్మిస్తున్న యోగి ఆదిత్యనాథ్..!!

వాస్తవం ప్రతినిధి:  యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయ్యాక చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పునాది పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆ దిశగా యూపీఏ సర్కారు అడుగులు వేస్తోంది. కాగా తాజాగా మరో సంచలన నిర్ణయం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నారు. అదేమిటంటే దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ యూపీలో నిర్మించాలని డిసైడ్ అయ్యారు. దీనికిగాను నోయిడాలో అనువైన స్థలాన్ని అన్వేషించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో సమావేశమైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గౌతం బుద్ధనగర్‌ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు.