ఏపీ జైళ్లలో కరోనా కలకలం..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ముందు నుండి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు భారీస్థాయిలో చేస్తున్న వారిపై కేసులు రికార్డుస్థాయిలో బయటపడుతున్న అరికట్టే విషయంలో ప్రభుత్వం విఫలం అవుతున్నట్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ పేరొందినా గాని కరోనా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు చాలా మంది భావిస్తున్నారు. రోజుకి దాదాపు 10 వేలకు పైగానే కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి నేపథ్యంలో సామాన్య ప్రజలలో భయాందోళనలు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి. దీంతో అడుగుతీసి అడుగు బయట వేయలేని పరిస్థితి ఏర్పడటంతో ఉద్యోగాలకు కరోనా భయంతో వెళ్లలేకపోతున్నారు. అంతేకాకుండా ఏపీ జైళ్లలో కూడా కరోనా విలయతాండవం చేస్తున్నట్లు లెక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,658 మంది ఖైదీలకు కరోనా సోకగా ఒకరు మృతి చెందారు. కాగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు కడప, రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో 300 మందికి పైగా సోకినట్లు సమాచారం. అదేవిధంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా, సబ్ జైళ్లలో కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం అన్ని జైళ్లో 250 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా బయట, జైల్లో కూడా వీరవిహారం చేస్తున్నట్లు తెలుస్తోంది.