వాస్తవం ప్రతినిధి: రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వేసుకున్న కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం, ఒంటినొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే, ఈ సైడ్ ఎఫెక్స్ తాము ఊహించినవేనని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అవి ఒకటి, ఒకటిన్నర రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేయగా వారిలో 14 శాతంమంది స్వల్ప దుష్ఫలితాలు ఉన్నాయని తెలిపారు.