బీజేపీ తెలంగాణ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని మోదీ 70వ జన్మదిన వేడుకలు..!!

వాస్తవం ప్రతినిధి: గల్ఫ్ దేశాలైన ఒమాన్, యూఏఈ, ఖతార్, కువైట్, బహరేన్‌లలో బీజేపీ తెలంగాణ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్టు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు. ఒమాన్‌లో.. ఒమాన్ కన్వీనర్ మంచికట్ల కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ ముఖ్య నాయకులు మామిడి శ్యాం, మురళి నడ్లపాటి, సాయి కుమార్ నిడిమోలు, అల్లే గంగాధర్, చెని గురువయ్య, సమంతి గంగాధర్ పాల్గొన్నారు. ఖతర్‌లో.. ఖతర్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. కువైట్‌‌లో.. కువైట్ కోఆర్డినేటర్ క్యాతం రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, భాస్కర్ కుమార్, సాయి, వాసు, కనకయ్య, శరత్, సురేందర్, ప్రవీణ్, ప్రబుదాస్, సురేష్, రాజు, రాజేష్, శేఖర్, ప్రవీణ్, అశోక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.