మహేష్ సినిమాలో హీరోయిన్ మారుతుందా..??

వాస్తవం సినిమా: సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సర్కారు వారి పాట అనే సినిమా మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అన్నట్లు కూడా ప్రచారం ముందు నుండి జరుగుతుంది.

అదే విధంగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన సమయంలో కీర్తి సురేష్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి కీర్తి సురేష్ వయస్సులో మరో హీరోయిన్ ని తీసుకోవటానికి సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లను సినిమా యూనిట్ పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన హీరోయిన్ విషయంలో రానున్నట్లు టాక్. పరిస్థితి ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయిందట.

డిసెంబర్ మాసంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఏకకాలంలో కంప్లీట్ చేసి విడుదల చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో పక్కా షెడ్యూల్ డైరెక్టర్ పరుశురాం ప్రిపేర్ చేసినట్లు సమాచారం .