మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ..!!

వాస్తవం సినిమా: బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగాడు సిద్ధార్థ. ముఖ్యంగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కానీ ఆ తరువాత ఓ టాప్ హీరోయిన్ తో గొడవలు జరిగినట్లు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రానట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చేసిన సినిమాలు కూడా చాలావరకు ఫ్లాపయ్యాయి. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న సిద్ధార్థ మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే

“ఆర్ ఎక్స్ 100” డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “మహా సముద్రం” సినిమా లో నటించడానికి సిద్ధార్థ ఓకే చెప్పినట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ సిద్ధార్థ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.