బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్న గంగవ్వ..??

వాస్తవం సినిమా: టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో గంగవ్వ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు. పల్లెటూరు నేపథ్యం, పైగా పెద్దావిడ కావటంతో ఆమెను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కల్మషం లేని మనసుతో పైగా ఎటువంటి స్ట్రాటజీ వేయకుండా చాలా జెన్యూన్ గేమ్ ఆడుతూ రాణిస్తోంది. అయితే హౌస్ లో నాలుగు గోడల మధ్య వాతావరణం తనకు పడటం లేదని దానికి అస్వస్థతగా ఉందని బిగ్ బాస్ కి ఏడ్చుకుంటూ తన బాధను వెల్లడించింది. మరోపక్క బిగ్ బాస్ సముదాయించినా గంగవ్వ హౌస్ నుండి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఏడ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే బిగ్ బాస్ హౌస్ నుండి చాలావరకు గంగవ్వ బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ హౌస్ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.