విజయ్ దేవరకొండ కి సారీ చెప్పిన తమిళ నిర్మాణ సంస్థ..!!

వాస్తవం సినిమా: తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ హీరో విజయ్ దేవరకొండ కి క్షమాపణలు తెలిపింది. ఇటీవల ఈ నిర్మాణ సంస్థ పేరిట సినిమా చేస్తున్నట్లు కొంతమంది హీరోయిన్లను సంప్రదించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వారు అంగీకరిస్తే సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటామని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు అట. ఇదే విషయం ఫిలింనగర్లో సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. దీంతో వెంటనే హీరో విజయ్ దేవరకొండ టీం వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసి వచ్చిన వార్తలు వాస్తవమే అని ధ్రువీకరించింది. వెంటనే సదరు నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకోవడానికి రెడీ అయిన సందర్భంలో డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల తమ సంస్థ పేరు బయటకు వచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ విధంగా పాల్పడిన సంస్థలో ఉన్న ఉద్యోగస్తుల పై చర్యలు తీసుకోబోతున్నట్లు యాజమాన్యం తెలిపింది.