మహేష్ సినిమా కోసం సెంటిమెంట్ ని నమ్ముకున్న రాజమౌళి..??

వాస్తవం సినిమా: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాలో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ప్రస్తుతం రాజమౌళి “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్న కొద్ది పెరుగుతున్నాయి. వాస్తవానికి అయితే “RRR” సినిమా వచ్చే జనవరి ఎనిమిదో తారీకు రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ సినిమాకి సంబంధించి షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు గాయాలు కావడంతో అలా అలా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. కాగా ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా జేమ్స్ బాండ్ తరహా లో ఉంటుందా లేకపోతే పిరియాడిక్ డ్రామా తరహాలో ఉంటుందా అన్నది సస్పెన్స్ గా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా రాజమౌళికి జులై మాసం సెంటిమెంట్ అని అందరికీ తెలుసు. అంతే కాకుండా తను డైరెక్ట్ చేసే సినిమాలు జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకుని మరీ రాజమౌళి నిర్మాతలకు ముందే చెబుతారని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ విధంగా మగధీర, బాహుబలి ఇంకా చాలా సినిమాలు జూలై మాసంలో విడుదల చేసి తిరుగులేని విజయాలను సాధించారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మహేష్ సినిమాకి అప్లై చేయాలని రాజమౌళి అనుకుంటున్నట్లు టాక్. పూర్తి మేటర్ లోకి వెళితే వచ్చే జూలై మాసంలో మహేష్ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాజమౌళి చేయబోతున్నట్లు ఫిలింనగర్లో ఇప్పటి నుండే వార్తలు జోరందుకున్నాయి.