పుట్టినరోజు నాడు ట్విటర్లో మోడీకి షాక్..!!

వాస్తవం ప్రతినిధి: సెప్టెంబర్ 17 వ తారీకు 70వ పుట్టిన రోజు సందర్భంగా మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకుల నుండి శుభాకాంక్షలు లభించాయి. అదేవిధంగా దేశంలో సినిమా హీరోలు, సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు ఇంకా చాలా మంది మోడీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు అయితే చాలా ఘనంగా మోడీ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇదిలా ఉండగా పుట్టినరోజునాడు ట్విట్టర్లో మోడీకి నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పూర్తి విషయంలోకి వెళ్తే ‘హ్యాపీ బర్త్ డే పీఎం మోదీ’ హ్యాష్ ట్యాగ్ తో పోలిస్తే, ‘నేషనల్ అన్ ఎంప్లాయిమెంట్ డే’ (జాతీయ నిరుద్యోగ దినం) హ్యాష్ ట్యాగ్ తో అధిక ట్వీట్లు రావడం గమనార్హం. ప్రధాని పుట్టిన రోజు నాడు సోషల్ మీడియాలో నిరసన తెలియజేయాలని కొన్ని రాజకీయ పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఆర్థిక సంక్షోభం ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో అధికశాతం మోడీని నిలదీస్తూ ట్విటర్లో పుట్టినరోజు నాడు ట్వీట్లు వచ్చాయి.