తప్పిన పెను ప్రమాదం..భారీ ఉగ్రదాడి ని భగ్నం చేసిన భారత సైన్యం

వాస్తవం ప్రతినిధి: పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటనను దేశం ఇంకా మర్చిపోలేదు. తాజాగా ఇటువంటి తరహా దాడిని ముందుగానే పసిగట్టిన భారత సైన్యం దాన్ని అడ్డుకుంది. జమ్మూ కాశ్మీర్ లో 52 కిలోల పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ప్రాంతానికి దగ్గరలోనే ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు భారత సైనికులు.

ఆర్మీ స్టేట్మెంట్ ప్రకారం గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ను చేపట్టారు. ‘ది కరేవ ఏరియా ఆఫ్ గడికాల్’ ప్రాంతంలో ఉన్న పండ్ల తోటలో సింటెక్స్ ట్యాంకును గుర్తించారు. అందులో అధికారులు పరిశీలించగా భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయి. 125గ్రాములు ఉన్న 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆ సింటెక్స్ ట్యాంకులో 50 డిటొనేటర్ల వరకూ ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ పేలుడు పదార్థాలను ‘సూపర్ 90’ అంటారని అధికారులు వెల్లడించారు.