ఇంటర్ విద్యార్థులకు శుభవార్త!

వాస్తవం ప్రతినిధి: కోవిడ్ -19 వ్యాప్తి రోజు రోజుకూ ఎక్కువవుతుండడంతో ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. సిలబస్ నుండి 30శాతం సిలబస్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నష్టపోయిన పని దినాలకు అనుగుణంగా సిలబస్ ను బోధించనున్నారు. సిబిఎస్సి సిలబస్ లో కోత విధించిన దానికి అనుగుణంగా రాష్ట్ర సిలబస్ లో కోత విధించనున్నారు. దాంతో నీట్, జెఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా నిర్ణయం తీసుకున్నారు.ఇక ప్రతి ఏడాది పనిదినాలు 222 ఉంటే..ఈ ఏడాది 40 రోజులు తగ్గించి 182 రోజులకు పరిమితం చేసారు. తొలగించిన సిలబస్ వివరాలను తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది.