సీఎం జగన్ కి భయం స్టార్ట్ అయింది : యనమల రామకృష్ణుడు..!!

    వాస్తవం ప్రతినిధి: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు దేశంలోనే సంచలనాలు సృష్టిస్తున్నాయి. న్యాయస్థానం పెండింగ్ లో ఉన్న ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆదేశాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి భయం స్టార్ట్ అయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్ లు చేశారు. అంతేకాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల హైకోర్టులు నుండి ఈ తరహా కేసులు కార్యాచరణను సిద్ధం చేయాలని సుప్రీం స్పష్టం చేసినట్లు యనమల మరోసారి గుర్తు చేశారు. ఇలాంటి కేసులు దేశంలో 4000 పెండింగ్ లో ఉంటే అందులో రెండు వేల ఐదు వందలు కేసులు రాజకీయ నాయకుల పైన ఉన్నవని పేర్కొన్నారు. అందులో వైఎస్ జగన్ కేసుకు సంబంధించి 12 చార్జిషీట్లు సిబిఐ కోర్టులో ఉన్నట్లు యనమల పేర్కొన్నారు. దీంతో వైయస్ జగన్ కి భయం పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తనపై ఉన్న కేసుల విషయంలో ప్రజల దృష్టి మరల్చడానికి వైయస్ జగన్ రకరకాల కుయుక్తులు పన్నుతున్నట్లు యనమల పేర్కొన్నారు.