ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రైతుల డిమాండ్లను టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎమ్మెల్యే సీతక్క కూడా అక్కడకు చేరుకొని ముట్టడి కార్యక్రమంలో పాల్గొని, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు. అంతేకాకుండా రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదంటూ ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీతక్కను అరెస్ట్ చేయడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మరోపక్క రైతుల సమస్యలపై న్యాయం కోసం వెలికిన తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె ట్విట్టర్ సాక్షిగా మండిపడ్డారు. నేనేమైనా టెర్రరిస్టునా?కేవలం రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు వెళితే ఇలాగా అరెస్ట్ లు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు.