ESI స్కామ్‌లో అసలు సూత్రధారి అతడే:అయ్యన్న పాత్రుడు

వాస్తవం ప్రతినిధి: ESI స్కామ్‌లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం అని… మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ కేసులో A 14గా ఉన్న తెలుకుపల్లి కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాక… మంత్రి కుమారుడు ఈశ్వర్‌కి పుట్టిన రోజున నాడు ఖరీదైన కారు అందించారన్నారు. ఆ ఫోటోలను A 14 తన ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫోటోలను అయ్యన్న మీడియాకు చూపించారు. 2019 డిసెంబర్‌లో గిఫ్ట్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము మోపుతున్న అభియోగాలపై ఆధారాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. మంత్రి జయరాంని పదవి నుంచి తప్పించాలని అయ్యన్న డిమాండ్ చేశారు. జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ ఈ సందర్బగ్మా డిమాండ్ చేశారు.