ఏపీ బీజేపీ కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డి అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: అంతర్వేది రథం దగ్ధం ఘటన ఏపీలో పెను దుమారమే రేపుతోంది.. రాజకీయమంతా ఈ రథం చుట్టూనే తిరుగుతోంది. అటు విపక్షాలు, హిందూధార్మిక సంఘాలు ఆందోళనలతో హోరెత్తిస్తుండటంతో .లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా..

అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నేడు బీజేపీ పిలుపునిచ్చిన ‘ఛలో అంతర్వేది’కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నిన్న రాత్రి అమలాపురంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఆపై ఆయన్ను పోలీసు వాహనంలో రాత్రంతా తిప్పుతూ ఉన్నారు. తనను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారని ఎంతగా ప్రశ్నించినా, పోలీసులు సమాధానం ఇవ్వడం లేదని, ప్రజలు శాంతియుతంగా తెలియజేయాలనుకుంటున్న నిరసనలను ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఈ ఉదయం విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.