ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!

వాస్తవం ప్రతినిధి: మహమ్మారి కరోనా వైరస్ రావటంతో కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో దేశంలో దాదాపు అన్ని రంగాలు క్లోజ్ అయ్యాయి. దీంతో చాలా వరకు నష్టాలు రావడంతో చాలా కంపెనీలలో యాజమాన్యాలు ఉద్యోగాలను తీసేయాలనే పరిస్థితి ఏర్పడింది. రాబడి లేక జీతాలు ఇవ్వలేక చాలామంది యజమానులు కంపెనీలలో పనిచేసే ఉద్యోగస్తులను తీసివేయడం తో ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ నిరుద్యోగ భృతి ని కల్పించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇది అమలులో ఉంటుంది. గరిష్టంగా 90 రోజులపాటు ఈ పథకం కింద భృతి లభిస్తుంది. అయితే, రెండేళ్లు ఉద్యోగం చేసి గరిష్టంగా 78 రోజులపాటు ఈఎస్ఐసి చందాదారులుగా ఉన్న వారు మాత్రమే ఈ భృతికి అర్హులు. పోస్టు ద్వారా గాని స్వయంగా గాని ఆన్లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోగా డబ్బులు ఎకౌంట్ లో జమ చేయబడుతుంది అని అధికారులు చెప్పుకొచ్చారు.