ఆర్భాటాలు తప్ప అసలు అభివృద్ధి లేదంటున్న టిడిపి..!!

  వాస్తవం ప్రతినిధి:  ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ పై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు కురిపించింది.

జగనన్న సన్నిధి రైతులకు పెన్నిధి అంటూ ఆర్భాటాలు డప్పులు కొట్టడం తప్ప అసలు అభివృద్ధి ఏమీ లేదని, ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదని టీడీపీ సోషల్ మీడియా భారీ స్థాయిలో కామెంట్లు చేస్తుంది. కనీసం రైతులకు గిట్టుబాటు ధర కూడా రావటం లేదని, 15 వేల రూపాయలు ఇచ్చి ధాన్యం ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చి, ఇప్పుడు మొహం  చాటేస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే….. ధర కాస్త 7 వేల రూపాయలకు పడిపోయి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు అంటూ టిడిపి పార్టీ చెప్పుకొచ్చింది. లేని భరోసా ఇవ్వడంలో  జగన్ ప్రభుత్వం పి హెచ్ డి చేసింది అంటూ రైతులు విమర్శలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా పేర్కొంది.

అంతేకాకుండా ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్నికల ముందు ఒక ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో టిడిపి సంచలన వ్యాఖ్యలు చేసింది.