ప్రధాని మోదీకి దేశవిదేశాల ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు

వాస్తవం ప్రతినిధి: భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాధినేతలు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారు.

మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మోడీకి గట్టిగానే విష్ చేస్తున్నారు. తెలంగాణా సిఎం కేసీఆర్ మోడీకి శుభాకాంక్షలు చెప్పారు. కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థంగా నడిపించే శక్తి భగవంతుడు మోదీకి ఇస్తాడని ఆశిస్తున్నా అని, మీకు నా శుభాకాంక్షలు ఉంటాయి అని చంద్రబాబు ట్వీట్ చేసారు. వైసీపీ నేతలు కూడా మోడీకి విష్ చేస్తున్నారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలో సేవా సపత్ అనే కార్యక్రమం ద్వారా పేదలకు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు బిజెపి నేతలు.